ఫ్లైఓవర్ పనులు ముమ్మరం చేయాలి
- జూన్ నెలాఖరు నాటికి అందుబాటులో తేవాలి
- సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లుఓవర్ పనులను తనిఖీ చేసిన కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 24 (విజయక్రాంతి): నగరంలోని చంచల్‌గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మిస్తున్న అత్యాధునిక స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జూన్ నెలలోగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన నిర్మాణ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించిన కమిషనర్, పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.
నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన సంతోష్ నగర్ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఈ స్టీల్ ఫ్లైఓవర్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. పనుల వేగాన్ని మరింత పెంచాలని, జూన్ నెలాఖరు నాటికి ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే, నిర్ణీత గడువు లోగా పనులు ముగించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో కమిషనర్ వెంట చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పనుల తాజా స్థితిగతులను కమిషనర్‌కు వివరించగా, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆర్‌వీ కర్ణన్ ఆదేశించారు.




