క్రీడల్లో ‘సర్వజ్ఞ’ విద్యార్థుల ప్రభంజనం
ఈ నెల 6 నుంచి 13వరకు చెన్నైలో జాతీయ స్థాయి పోటీల నిర్వహణ
ఖమ్మం, ఏప్రిల్ 17(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని వీడిఓస్ కాలనీ నందు గల సర్వజ్ఞ పాఠశాల విద్యార్థులు క్రీడారంగంలో తమ అసాధారణ ప్రతిభను చాటు తూ జాతీయ స్థాయిలో పాఠశాల పేరును మారుమోగించారు.ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు జరిగిన అండర్-14 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు పతకాలతో తిరిగి రావడంతో పాఠశాలలో సందడి నెలకొంది.
చెన్నైలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో అండర్-14 విభాగంలో విద్యార్థులు శ్యామ్, జశ్వంత్ సాయి, జాసిక్ తమ కృషి, పట్టుదలతో ఆడి ద్వితీయ స్థానా న్ని (రన్నరప్) కైవసం చేసుకున్నారు. టచ్ రగ్బీ విభాగంలో శశాంక్, హృతిక్ చంద్ర, మహిదర్, శ్రీకర్, సాత్విక్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఆర్‌వీ నాగేంద్ర కుమార్, డైరెక్టర్ నీలిమ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కేవలం పుస్తక పఠనమే కాకుండా, క్రీడలు కూడా ఒక అంతర్భాగం కావాలి. చదువు మేథస్సును పెంచితే, క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల క్రీడల్లో గెలుపోటముల కంటే పట్టుదలతో పోరాడటం ముఖ్యం. నేడు జాతీయ స్థాయిలో రాణించిన ఈ విద్యార్థులు రేపు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, కోచ్‌లు పాల్గొని విద్యార్థులను అభినందించారు.






