27 February, 2026 | 5:17 PM

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర

27-02-2026 03:30 PM

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి

షాద్‌నగర్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమైనద ని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ముచ్చంతల్ స్వర్ణ భారతిట్రస్ట్ లో షాద్ నగర్ నియోజకవర్గంలోని సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై నూతనంగా ఎన్నికైన సర్పంచులతో  తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ... స్థానిక వనరుల సమర్థ వినియోగం, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ఏర్పాటులో ముందుండి ప్రజలను మెప్పించి మరింత ఉన్నత పదవులకు చేరుకోవాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉన్నత అధికారులు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.