నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన సర్పంచ్
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బంజర తండ గ్రామంలో అర్హులైన లబ్ధిదారుకులు మలావత్ శాంతికి మంజూరైన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం గ్రామ సర్పంచ్ సురేష్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మలావత్ శాంతి మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు నిరుపేదనైనా నన్ను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నూతన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఎన్నో ఏళ్ల కల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంతో సహకారమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మంజూరుతో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే నిరుపేదల ప్రభుత్వమని, ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్, ఎంపీఓ ప్రకాష్ చారి, కార్యదర్శి మమత గ్రామస్తులు ఉన్నారు.




