27 March, 2026 | 6:54 PM

నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

27-03-2026 05:02 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వెంకంపల్లి గ్రామంలో నూతన సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ సిహెచ్.జ్యోతి సురేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతన సీసీ రోడ్డు పనులను గ్రామంలోని పోచమ్మ టెంపుల్ నుండి గ్రామపంచాయతీ వరకు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సిహెచ్ జ్యోతి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఎంజి ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు 10 లక్షల నిధులు మంజూరు కావడంతో నూతన సిసి రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి పది లక్షల నిధులు మంజూరుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.