22 July, 2026 | 4:15 PM

సోనాల ఆసుపత్రి డాక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయండి

22-07-2026 03:14 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నవీన్ రెడ్డి డిప్యూటేషన్ ని రద్దు చేయాలని బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న జిల్లా వైద్యాధికారి నీ కోరారు. 33 గ్రామ పంచాయతీలకు 11 సబ్ సెంటర్ల ద్వారా వైద్యం అందిస్తున్నారు. అంతేగాక హాస్టల్ విద్యార్థులకు విద్యార్థులకు మండలంలో ఉన్న 20వేల మంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.

అయితే డాక్టర్ కు డిప్యూటేషన్ ఇవ్వడం వల్ల మండల ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని పేర్కొన్నారు. తక్షణమే తగు న్యాయం చేయాలని ఆయన జిల్లా వైద్యాధికారిని కోరారు. వర్షాకాలంలో డెంగీ మలేరియా విష జ్వరాలతో పాటు సీజనల్ వ్యాధులు ప్రతి సంవత్సరం సోకుతున్నాయని అత్యవసర పరిస్థితులలో ప్రజలకు డాక్టర్ లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కసిరపోతన్న సీనియర్ నాయకులు రాందాస్ ఉన్నారు.