22 July, 2026 | 4:35 PM

Breaking News

నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్

22-07-2026 03:35 PM

ఉప్పల్,(విజయక్రాంతి): విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ మరియు ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించినందుకు నాచారం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు మల్కాజిగిరి  కమిషనర్ సుమతి ప్రత్యేక రివార్డ్ అందజేశారు. 2026 సంవత్సరంలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులను గుర్తించి సత్కరించే కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ ఫ్రాన్సిస్‌ను అభినందించి రివార్డ్ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఆయన సేవలను కొనియాడుతూ, ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. రివార్డ్ అందుకున్న ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సహచర పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు నాచారం పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.