కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత
న్యూఢిల్లీ: కాక్రోచ్ పార్టీ( Cockroach Party protests) ఆందోళనల దృష్ట్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండి హౌస్, ఐటీఓ, ఖాన్ మార్కెట్‌తో సహా పదహారు ఢిల్లీ మెట్రో స్టేషన్లను బుధవారం ఉదయం మూసివేసినట్లు డిఎంఆర్‌సి తెలిపింది. జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసన కొనసాగుతున్న తరుణంలో ఈ మూసివేతలు జరిగాయి. మెట్రో స్టేషన్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Minister Dharmendra Pradhan) రాజీనామా చేయాలని సీజేపీ మద్దతుదారులు నినాదాలు చేస్తున్నారు. విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను విచారించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత
"భద్రతా కారణాల దృష్ట్యా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బరాఖంబా రోడ్, సుప్రీం కోర్ట్, సేవా తీర్థ్, జన్పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ (ITO), ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లను మూసివేశారు" అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) 'X' వేదికగా తెలిపింది.






