సరస్వతమ్మ.. ఫ్యాన్స్‌కు ప్రెసిడెంట్
హీరో శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అలరించబోతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌తోపాటు రొమాన్స్, ఎమోషన్స్‌తో రూపొందిస్తున్నారు. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. 1992లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలను పోషిస్తున్నారు. శుక్రవారం రాధిక పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పాత్రను ‘సరస్వతమ్మ’గా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘జై బాలయ్య’ హెడ్‌బ్యాండ్ కట్టుకుని, సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న రాధిక పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా బాలయ్య అభిమానిగా పాత్రను డిజైన్ చేయడం ఆసక్తికరంగా ఉంది. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్; ఎడిటర్: చోటా కే ప్రసాద్.






