22 April, 2026 | 4:34 PM

రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది

22-04-2026 03:12 PM

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

 సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన సిపిఐ ఏఐటీయూసీ

దేవరకొండ,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది.తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.అని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు ఎండి మైనొద్దీన్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు దేవరకొండ పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్ లను పునరుద్ధరిస్తామని, వేతన సవరణ, అవుట్సోర్సింగ్ ,కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ,ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నడిపిస్తామని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ తక్షణమే చెల్లిస్తామని ,పెంచిన పనిభారాలను తగ్గించాలని, వారు తెలియజేసిన డిమాండ్లు న్యాయమైనవి.

కావున ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించి, విద్యార్థులకు, మరియు ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను  వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలనీ కోరడం జరిగింది. తక్షణమే ఈ డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ కార్మికులకు అండగా ఉంటూ సమస్యలు సాధించేవరకు ఉద్యమాలు చేస్తామని ఉద్యమాల ద్వారానే సాధించుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ పట్టణ కార్యదర్శి వలమల్ల ఆంజనేయులు,సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు మొగిల్లా వెంగలయ్య,అలామోని మల్లయ్య, కందుకూరి శ్రీను,ఎండి వాహబ్,దోమల వెంకటయ్య,వి వీరయ్య, ఆర్టీసీ జేఏసీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.