12 July, 2026 | 3:28 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •  

సప్త శక్తి సంఘం మహిళల్లో చైతన్య జ్యోతి కార్యక్రమం

26-12-2025 06:12 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సప్తశక్తి సంఘం పేరుతో మహిళా చైతన్య కార్యక్రమం శుక్రవారం శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా మహిళల హాజరై ఉత్సాహాన్ని నింపారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ఆకుల శైలజ, కార్యక్రమ అధ్యక్షులుగా సముద్రాల ప్రణీత రాణి, సన్మాన గ్రహీతలుగా తోట సునీత, సిరికొండ పుష్పలత,ముఖ్య వక్తలుగా అలివేలు మంగ, వాణి సక్కుబాయి పాల్గొన్నారు. వాణి సక్కుబాయి గారు  సందేశం ఇస్తూ  భారతదేశ పురోగతిలో మహిళల పాత్ర అనితర సాధ్యమని పేర్కొన్నారు.

మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వడం, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అవసరమని తెలిపారు. కుటుంబం నుంచి సమాజం వరకు మహిళలు చేసే సేవలు, కృషి దేశ అభివృద్ధికి పునాది లాంటివని తెలియజేశారు. శ్రీమతి అలివేలు మంగ  మాట్లాడుతూ... రోజువారి జీవితంలో కుటుంబం పర్యావరణహిత చర్యలు అవలంబించడం, భూమి వనరులను సంరక్షించడం, ప్రకృతిని కాపాడే అలవాటులను అభివృద్ధి చేసుకోవడం భవిష్యత్తు తరాలకు అందించాల్సిన గొప్ప బహుమతి అని పేర్కొన్నారు.