08-02-2026 12:42:11 AM
ఖరారు చేసిన మహాయుతి కూటమి
డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సంజయ్ శంకర్ ఘాడి ఎంపిక
ముంబై, ఫిబ్రవరి 7: బీజేపీకి చెందిన రీతూ తవాడే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) మేయర్ అభ్యర్థిగా ఎంపిక య్యారు. ఈ మేరకు మహాయుతి కూటమి బీఎంసీ మేయర్ అభ్యర్థి(బీజేపీకి చెందిన)గా రీతూ తవాడేను శనివారం బీజేపీ నాయకుడు అమిత్ సతమ్ ప్రకటించారు. శివసేనకు చెంది న సంజయ్ శంకర్ ఘడి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఖరారుచేశారు. రితూ తవాడే మూ డుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
బీఎంసీ విద్యా కమిటీ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. సంజయ్ శంకర్ ఘాడి 15 నెలలుగా 5వ నెంబర్ వార్డు సభ్యుడిగా ఉన్నారు. 2022లో శివసేనలో చీలిక ఏర్పడినప్పుడు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన వారిలో ఆయన కూడా ఉన్నారు. బీఎంసీతో సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు గత జనవరి 15న ఎన్నికలు జరుగగా, 16న ఫలితాలు వెలువడ్డాయి.
227 మంది సభ్యుల బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 118 స్థానాలతో మెజారిటీ కంటే నాలుగు స్థానాలు ఎక్కువగా గెలుచుకుంది. మహాయుతి కూటమిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేసి 3 సీట్లు గెలుచుకుంది. వీటితో కలిపి మహాయుతి కూటమి బలం 121కి చేరింది. కాగా, గత 25 ఏళ్లుగా బీఎంసీని ఏలిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన 65 సీట్లు గెలుచుకుంది.