2 July, 2026 | 6:38 PM

మరో కుటుంబం కుల బహిష్కరణ.. రక్షణ కల్పించాలని దంపతుల వేడుకోలు

02-07-2026 05:32 PM

రక్షణ కల్పించాలని దంపతుల వేడుకోలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో మరో కుల బహిష్కరణ ఘటన వెలుగు చూసింది. ఇటీవల కన్నెపల్లి మండలం భీంపూర్లో పార్టీ ఫిరాయింపు చేయనందుకు కాంగ్రెస్కు చెందిన వార్డు సభ్యురాలు తానక్క కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ఈ సంఘటనను మరువకముందే బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో మరో సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. కుల బహిష్కరణకు గురైన బాధిత కుటుంబ సభ్యులు బెల్లంపల్లి మీడియాను ఆశ్రయించింది. చంద్రవెల్లి గ్రామం కర్ణ గొల్ల సామాజిక వర్గానికి చెందిన దంపతులు పోలవేణి పవన్, మంజుల సంఘటన వివరాలను వెల్లడించారు.

అకారణంగా కుల బహిష్కరణ చేశారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కుల పెద్దలు కుల బహిష్కరణను ఏడాది కాలం కొన సాగిస్తూ, రూ. 5 ఐదు వేలు జరిమానా విధించారని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు పోలవేణి రాజం, కొమ్ము బీరయ్య, పోలవేణి మొండి  ఏడాదిన్నర క్రితంగా కుల బహిష్కరణతో నరకయాతన పడుతున్నారన్నారు. తమ తల్లిదండ్రులు పోలవేణి రాగులయ్య, పొలవేణి భూమక్కల ఆస్తి పంపకాల్లో తన వాట గా 4.5 గుంటల భూమి వచ్చిందన్నారు. తమ ఇంటి సమీపంలో ఉంటున్న తమ్ముడు రాజు తన వాటా నుంచి ఇంటి త్రోవ కు 12 ఫీట్ల స్థలం ఇవ్వాలని కుల పెద్దలు నిర్ణయించారని తెలిపారు. అందుకు తాను అంగీకరించినట్లు  పేర్కొన్నారు.

కాని అదనంగా ఒక ఫిట్ నర స్థలం ఇవ్వాలని బెదిరింపులకు గురి చేస్తూ కులపెద్దలు, తమ్ముడు రాజుతో కుమ్మక్కై అనేక విధాలుగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని సంవత్సరo నరకాలం నుంచి సామాజికంగా దూరం పెడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన "పస్కా పిల్ల" వేడుకకు కూడా తమను ఆహ్వానించలేదని, దీనిపై ప్రశ్నించగా పోలవేణి రాజం ఫోన్‌లో దుర్భాషలాడారని తెలిపారు. ఇటీవల పోలవేణి రాజు తనపై సబ్బలితో వచ్చి భూమి ఇస్తావా లేదా చంపుతానని దాడికి యత్నించారని తెలిపారు. కులపెద్దల కక్ష సాధింపు, మరోవైపు తమ తమ్ముడితో ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని దంపతులు విజ్ఞప్తి చేశారు.