calender_icon.png 8 February, 2026 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవర మాటిచ్చారంటే.. తప్పేదేలే

08-02-2026 01:50:37 AM

సాయం కోసం ఎవరొచ్చినా ఉత్తగ పంపిందే లేదు

ఇప్పటికే సొంత నిధులతో కోట్ల రూపాయల పనులు

గుడులు, బడులకు లక్షల్లో విరాళాలు

ప్రచారంలో దూసుకెళ్తున్న సమత వెంకట్‌రెడ్డి

చేవెళ్ల, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ దేవరలో ‘దేవర చెప్పిండంటే’ అని ఓ డైలాగ్ ఉంటుంది. చేవెళ్ల మున్సిపాలిటీలో 16 వార్డు నుంచి పోటీ చేస్తున్న చైర్ పర్సన్ అభ్యర్థి సమత వెంకట్ రెడ్డి కూడా దేవర టైపే.. ఆమె మాటిచ్చారంటే ఇప్పటి వరకు తప్పిందేలేదు. ఎవరైనా సాయం కోసం వస్తే ఇప్పటి వరకు ఉత్తగ పంపిందే లేదు. అందుకే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆమెకు తిరుగు లేకుండా పోయింది.

ఇప్పటికే వార్డే కాదు.. మున్సిపాలిటీ వ్యాప్తంగా సొంత నిధులు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు, బోర్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలతో పాటు గుడులు, బడులు లక్షల రూపాయలు నిధులు విరాళంగా ఇచ్చిన వారికి ఏ ఇంటికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు.‘బేఫికర్ గా ఉండు.. గెలిపిస్తున్నం బిడ్డా’ అని ఆశీర్వదిస్తున్నారు. తమ భర్తను చేవెళ్ల పీఏపీఎస్ చైర్మన్‌గా  ఆదరించారని గుర్తు చేశారు. తన సహధర్మచారి దేవరి వెంకట్ రెడ్డి రైతుల స్థితిగతులు తెలిసిన నేతగా, పీఏసీఎస్ కార్యాలయాన్ని గోదామ్‌ను నిర్మించారని చెప్పుకొ చ్చారు.

బీసీ సంఘానికి కమ్యూనిటీ హాల్, మల్లన్న గుడి నిర్మాణానికి రూ.30 లక్షల విరాళం, వీరభద్ర కాలనీలో పోచమ్మ గుడి, విశ్వకర్మ కాలనీలో సొంత నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, తను చదివిన స్కూలుకు రూ. లక్ష విరాళమిచ్చారు.  ప్రజలకు సమస్య వచ్చిందంటే పరుగున వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీమంత్రి రంజిత్ రెడ్డి సహకారంతో మున్సిపల్కు అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాననిచెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు.

పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, కార్పొరేట్ ఆస్పత్రిలో రూ.10 లక్షల ఆరోగ్య భీమా, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా రైతు బీమా పథకాలు అందిస్తుందని చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. హెచ్‌ఎండిఏ నిధులు రూ. 15 కోట్లతో చేవెళ్లలో ఇదివరకే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని గుర్తు చేశారు.