ఏఐ ప్లస్ నుంచి నోవా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ప్రారంభం
ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ తన కొత్త నోవా సిరీస్ లో భాగంగా విడుదల చేసిన తాజా స్మార్ట్‌ఫోన్‌లు నోవా 2 ప్రో మరియు నోవా 2 నియో విక్రయాలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది. మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి అధిక పనితీరు కోరుకునే వినియోగదారుల వరకు విస్తృత శ్రేణి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ రెండు మోడళ్లు జూన్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ మరియు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటాయి. నోవా సిరీస్ ప్రారంభం నుంచి భారతీయ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల నుంచి విశేష ఆదరణను పొందుతోంది. నోవా 2 ప్రో మరియు నోవా 2 నియో విడుదలతో ఆ విజయ పరంపర మరింత బలపడనుంది.
విక్రయాల ప్రారంభంపై స్పందిస్తూ ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ సీఈఓ , వ్యవస్థాపకుడు మాధవ్ శేఠ్ మాట్లాడుతూ: నోవా 2 ప్రో మరియు నోవా 2 నియో ద్వారా మరింత మంది వినియోగదారులకు శక్తివంతమైన, ఆకర్షణీయమైన మరియు నమ్మకమైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించాలన్నదే లక్ష్యమన్నారు. పనితీరు, బ్యాటరీ లైఫ్, కెమెరా సామర్థ్యం, సాఫ్ట్‌వేర్ నాణ్యత మరియు గోప్యత వంటి రోజువారీ వినియోగానికి అత్యంత ముఖ్యమైన అంశాలపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తద్వారా వినియోగదారులు తమ బడ్జెట్ కారణంగా ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.
నోవా 2 నియోలో6300 5G చిప్‌సెట్‌ను అందించారు. ఇందులో 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.745 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లే ఉండి, రోజువారీ వినియోగంలో స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. అదనంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్, డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్, 2TB వరకు విస్తరించగల స్టోరేజ్ మరియు 8.5 ఎంఎం స్లిమ్ డిజైన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను మరింత ఉపయోగకరంగా మారుస్తాయి. నోవా 2 ప్రోలో 7100 చిప్‌సెట్‌ను అందించారు. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ వరకు హెచ్ బీఎం బ్రైట్‌నెస్ మరియు మల్టీ-లేయర్ కూలింగ్ సిస్టమ్‌తో కూడిన 6.9 అంగుళాల ఎఫ్ హెచ్ డీ ప్లస్ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది.






