18 రోజుల పసికందు విక్రయం
11-04-2026 01:59 AM
- ఐదుగురిపై కేసు నమోదు చేసిన సీఐ
- బాన్సువాడ మండలం సోమేశ్వర్‌లో ఘటన
బాన్సువాడ, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో కన్న బిడ్డను విక్రయించిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోనీ సోమేశ్వర్ గ్రామంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు ఆడపిల్లల తర్వాత మళ్లీ నాలుగో సంతానం కూడా ఆడ బిడ్డే పుట్టింది.
దీంతో తల్లిదండ్రులు పోషించలేక 18 రోజుల శిశువును లక్ష రూపాయలకు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన మహిళకు విక్ర యించినట్లు తల్లి కిష్టవ్వ తెలిపింది.తాము పోషించలేకే ఆ శిశువును అమ్మినట్లు పేర్కొంది. ఈ విషయమై బాన్సువాడ పోలీ స్ స్టేషన్‌లో ఫిర్యాదు రాగా విచారణ చేపట్టిన అనంతరం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు.




