17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సలాం భయ్యా..సమతా ప్రచారం

10-02-2026 01:21 AM
  1. నన్ను గెలిపించండి.. మీ నమ్మకాన్ని వమ్ము చేయను 
  2. చేవెళ్ల 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థ్గి దేవర సమతా వెంకట్ రెడ్డి 

చేవెళ్ల, ఫిబ్రవరి 9(విజయక్రాంతి): ము న్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు 16వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి దేవర సమతా వెంకట్ రెడ్డి సలాం భయ్యా..! అంటూ...ప్రచారంలో దూసుకు పోయారు. మున్సిపల్‌లోని 14,15 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలతో కలివిడిగా మాట్లాడుతూ... ప్రచారం చేశారు.  మీ నమ్మకాన్ని వమ్ము చేయను.. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి అంటూ ప్రచారం సా గించారు.

వారు మాట్లాడుతూ...ఏ సమస్య ఉన్న పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు అండగా ఉంటానన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎంపీ రంజిత్ రెడ్డిల సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం, మెరుగైన పారిశుధ్యం ఏర్పాటు చేసి మున్సిపల్ రూపురేఖలు మార్చుతామని స్పష్టం చేశారు. మీ బిడ్డగా 16వ వార్డు కౌన్సిలర్ గా తనను ఆదరించాలన్నారు.

హెచ్‌ఎండీఏ నిధులు రూ.15 కోట్లతో చేవెళ్లలో ఇదివరకే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించమని గుర్తు చేశారు. అధికార పార్టీ నుంచి అధిక నిధులు తెచ్చి అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటప్రకారం ఆరు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అభివృద్ధిలో చేవెళ్ల రూపురేఖలు మార్చి చూపిస్తానని వాగ్దానం చేశారు.