10-02-2026 01:23:23 AM
వేములవాడ, ఫిబ్రవరి 9(విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ అభ్య ర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న బు ట్టి లావణ్యరమేష్ దంపతులు తమ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ముగించారు. ప్రభు త్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆశీస్సులతో పోటీలో ఉన్న వారు ప్ర చారంలో భాగంగా వార్డులో గడపగడపకూ పర్యటించి ఓటర్లను కలిశారు.
ఈ సందర్భం గా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన వారు, తమకు అవకాశం కల్పిస్తే వార్డులో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తామని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో 27వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని పేర్కొంటూ ఓటర్ల ఆశీర్వాదం కోరారు.