15 May, 2026 | 3:30 PM

Breaking News

అటవీ భూమిలో పశువుల పాకల నిర్మాణం.. గ్రామస్తుల వివాదం   •   బెల్లంపల్లి బస్తీలో పోలీసుల కార్డెన్ సెర్చ్   •   ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన   •   శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్   •   ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం   •   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •  

ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.. సజ్జనార్ వార్నింగ్

03-02-2026 01:58 PM

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad Police Commissioner VC Sajjanar) మంగళవారం నాడు ప్రజలకు, ముఖ్యంగా యువతకు, ప్రమాదకరమైన రీల్స్ చేయవద్దని హెచ్చరించారు. రైల్వే ట్రాక్‌లపై పడుకుని ప్రాణాలను పణంగా పెట్టి ఒక వ్యక్తి చేసిన రీల్‌పై స్పందిస్తూ, ఆయన ‘ఎక్స్’లో ఇలా అన్నారు. “వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఒక్క సెకను తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బాధ్యతగా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండకండి” అని సజ్జనార్(Sajjanar) సూచించారు. ఫేమస్ అయిపోవాలని రీల్స్ పిచ్చిలో యువత వింత వింత ప్రయత్నాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే.