16 August, 2026 | 3:30 AM

రేపు శబరిమల ఆలయం పునః ప్రారంభం

16-08-2026 12:00 AM
  1. 17 నుంచి 21 వరకు దర్శనాలు
  2. 24 నుంచి ఓనం పూజలు
  3. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ స్పష్టీకరణ

తిరువనంతపురం, ఆగస్టు 15: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం భక్తుల దర్శనార్థం, చింగం మాస పూజల నిమిత్తం తెరుచుకోనున్నట్లు టీడీబీ (ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్) శనివారం ప్రకటించింది. భక్తులకు రవాణాలో అసౌకర్యం కలగకుండా కేఎస్‌ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేస్తున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు తెలిపారు. సోమవారం ఆలయ పూజారి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో ప్రధాన పూజారి ప్రసాద్ 5 గంటలకు ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ప్రకటించారు. మలయాళ నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని ఈ నెల 17న ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.

చింగం మాస పూజలు ముగిశాక ఆగస్టు 21 రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేసి, తిరిగి ఓనం పండుగ పూజల కోసం ఈ నెల 24న తెరుస్తారు. కాగా కేఎస్‌ఆర్టీసీ పంబ బేస్ క్యాంప్ నుంచి చేరుకునేందుకు నిలక్కల్ నుంచి 24 గంటలపాటు ఆర్టీసీ షటిల్ సర్వీసు సేవలను నడపుతుందని ప్రకటించారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి తిరువనంతపురం సెంట్రల్ డిపో నుంచి కూడా బస్సులు నడుపుతామని స్పష్టం చేసింది. భక్తులు ముందస్తుగా ‘శబరిమల ఆన్‌లైన్ పోర్టల్’ ద్వారా వర్చువల్ క్యూ స్లాట్లను దర్శనం కోసం బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.