18 July, 2026 | 1:27 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

22-10-2025 08:46 AM

26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.

టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం.

తిరుమల: తిరుమల(Tirumala Tirupati Devasthanams)లో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి(Sarvadarshanam) 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 76,343 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 18,768 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. తిరుమలలో మంగళవారం నాడు రూ. 4.34 కోట్ల హుండీ ఆదాయం(Tirumala hundi collection) వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లకు సంబంధించి లక్కీ డిప్ లో టికెట్లు పొందిన వారు రేపు మధ్యాహ్నం 12 గంటలకు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.