18 July, 2026 | 1:09 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

నేటి నుంచి శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు

22-10-2025 08:00 AM

హైదరాబాద్: నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు (Karthika Mahotsavam Celebrations) జరగనున్నాయి. బుధవారం నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాస వేడుకలు నిర్వహించనున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈఓ(Srisailam Temple EO) ప్రకటించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. మల్లన్న భక్తులకు దర్శనం, లడ్డూ ప్రసాదం, వసతి ఏర్పాట్లు, పార్కింగ్, పాతాళగంగ స్నాన ఘట్టాలు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో వెల్లడించారు. కార్తీక  మాసంలో రూ. 5 వేల గర్భాలయ, రూ. 1500 సమూహిక అభిషేకం రద్దు చేయబడింది. రోజూ విడతలవారీగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం, ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మీడియా ప్రకటనలో తెలిపారు.