7 March, 2026 | 11:43 PM

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టండి

07-03-2026 09:47 PM

- బేటీ పడావ్, బేటీ బచావో మాటలకే పరిమితం చేస్తున్న ప్రభుత్వాలు 

- శ్రామిక మహిళలను దోచుకుంటున్న పాలకులు : సిఐటీయు, ఐద్వా

ఇల్లె౦దు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని ఏలూరి భవన్ లో సిఐటీయు, ఐద్వా, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆద్వర్యంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఐటీయూ, ఐద్వా నేతలు ఈసం వెంకటమ్మ, ఆలేటి సంధ్య, సుల్తానా, కే మరియా, జి ఉమాదేవి లు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నదనీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి.

మహిళల పట్ల చిత్తశుద్ధి కొరవడిందని శ్రామిక మహిళల శ్రమ దోపిడీ చేస్తున్న కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని వాపోయారు. మహిళను విలాస వస్తువుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ ల వల్ల శ్రామిక మహిళలకు రక్షణ కరువైందని మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనులు చేయవలసిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.

స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి చేరవేస్తూ అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని పనిచేస్తున్నా వారికి కనీస వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం లేదని వారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఐక్యమై మహిళలు ఏడుకొంటున్న సమస్యలపై సంఘటితంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో మునిగంటి లక్ష్మీ, రేణుక, పల్లి సుజాత, సంతోష, మమత, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.