12 April, 2026 | 9:30 AM

శివాలయంలో ఘనంగా రుద్రాభిషేకం

06-10-2025 05:43 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో ఆశ్వయుజ మాసం సోమవారం పురస్కరించుకొని పల్లా సంధ్య మహేష్ దంపతులు స్వామి వారికి పలు రకాల పండ్లతో సోమవారం రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో ఆలయ అర్చకులు వల్ల కొండ మఠం మహేష్, రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ అల్లెంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.