15 August, 2026 | 12:07 PM

ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ శనివారం పూజలు

15-08-2026 11:31 AM

గణపురం,ఆగస్టు 15 (విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలోని గణప సముద్రం సరస్సు కట్టపై కొలువైన శ్రీ దక్షిణముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలలో భాగంగా తొలి శనివారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ అర్చకులు శ్రీమాన్ గోవర్ధన వేణుగోపాలచార్యులు చందనంతో అలంకరించి తమలపాకుల మాలలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.