18 August, 2026 | 1:18 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

22-04-2026 06:32 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిపిఐ ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆర్టీసీ కార్మికులు చేస్తున్నా రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట డిపో వద్ద కార్మికులు సమ్మెకు సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించాలి.

కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేసి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న పే స్కేల్, పిఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అపాయింట్మెంట్ తేదిన ప్రకటించాలని, యూనియన్ లను పునరుద్ధరించాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.