3 March, 2026 | 9:36 PM

ఆర్టీసీ బస్సు ప్రారంభం

03-03-2026 12:00 AM

సంస్థాన్ నారాయణపూర్, మార్చి 2 : మండలంలోని లింగవారిగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రారంభించారు. లింగవారిగూడెం గ్రామానికి గతంలో ఉన్న బస్సు సర్వీసును కొన్ని నెలలక్రితం ఆపివేయగా ప్రజల సౌకర్యార్థం బస్సును పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆర్టీసీ సంస్థ అధికారులతో మాట్లాడి బస్సు సేవలను  ప్రారంభించారు.

గ్రామస్తులు ఆర్టీసీ బస్సు సేవలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. తమ బాధలను గుర్తించి అధికారులతో మాట్లాడి బస్సును ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ డిపో మేనేజర్ రమణ, సర్పంచ్ కత్తుల జ్యోతి వాసు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్ రెడ్డి, తీర్పారి వెంకటేశ్వర్లు, గురిజే రామచంద్రం, బోల్గురి నరసింహ, సీపీఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కత్తుల లక్ష్మయ్య, ఆయా గ్రామాల సర్పంచులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.