calender_icon.png 21 February, 2026 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు రూ.387.53 కోట్లు

21-02-2026 01:49:21 AM

మూడో విడతగా 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల 

  1. ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో రూ. 2000 కోట్లు
  2. పెండింగ్ నిధులను త్వరితగతిన విడుదల చేయాలి 
  3. అప్పుడే అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతాయి- 
  4. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తవడంతో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన పెండింగ్ నిధులను కేం ద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ క్రమంలో మూడో విడతగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 387. 53 కోట్లను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ.1034.42 కోట్ల నిధులు అందాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా కొనసాగేందుకు ఈ నిధులు కీలకంగా ఉపయోగపడనున్నా యి.

ముఖ్యంగా గ్రామాల్లో మౌ లిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సర ఫరా, వీధి దీపాల ఏర్పాటు, అం తర్గత రహదారుల మరమ్మతులు వంటి పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. అయితే, తెలంగాణకు ఇంకా సుమారు రూ. 2000 కోట్ల మేర కేంద్ర ప్రభు త్వం విడుదల చేయాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిధుల ఆలస్యం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావితమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పెం డింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వా న్ని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాం తాల్లో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగాలంటే నిధుల సమయానుకూల విడుదల అత్యంత అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటివరకు విడుదలైన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, ముఖ్యంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని,

అలాగే గ్రా మాల్లో ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్ట మైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పారదర్శకతతో నిధుల వినియోగం, ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉం దని మంత్రి సీతక్క మరోసారి పునరుద్ఘాటించారు.