నిజామాబాద్‌లో ఆర్‌ఎస్ బ్రదర్స్ షోరూమ్
ప్రారంభించిన మేయర్ ఉమారాణి, సినీ నటి నిధి అగర్వాల్
నిజామాబాద్, మార్చి 5(విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలో గురువారం సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా ఆర్‌ఎస్ బ్రదర్స్ మరో మైలురాయిని సగర్వంగా చేరుకుంది. సౌత్ ఇండియాలో ఆర్‌ఎ స్‌బ్రదర్స్ బ్రాండ్ తన పేరు ప్రఖ్యాతలను విస్తరించి, కుటుంబ షాపింగ్ అవసరాలను తీర్చే విశ్వసనీయ సంస్థగా, ఏకైక గమ్యంగా, నిజామాబాద్ నడిబొడ్డున- ఓల్డ్ గవర్నమెం ట్ హాస్పిటల్ ఎదుట, ఆర్‌పీ రోడ్‌లో విజయకేతనం ఎగురవేస్తోంది.
దార్శనికులైన పి వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, టి ప్ర సాదరా వు, దివంగత పి సత్యనారాయణ నెలకొల్పిన ఆర్‌ఎస్ బదర్స్- సంప్రదాయాన్ని ఆధునిక జీవనశైలిని మేళవించిన ఒక సుప్రసిద్ధ బ్రాండ్‌గా రూపు సంతరించుకొని- వైవిధ్యం లో, నాణ్యతలో, విశ్వసనీయతలో, అం దుబాటు ధరలో కుటుంబంలోని అన్నితరా ల వారిని ఆకర్షిస్తూ అలరిస్తోంది. నిజామాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవానికి స్థానిక వినియోగదారులు పెద్ద సంఖ్యలో విచ్చేయ డం విశేషం. కె ఉమారాణి ముదిరాజ్, మేయర్ మునిసిపల్ కార్పొరేషన్ ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్‌ను ప్రారంభించారు.
అతిథిగా పాల్గొన్న ప్రఖ్యాత నటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలు మొదలుకుని, పర్వది నాల వరకు ప్రతీ వేడుకకూ అచ్చంగా సరిపోయే వెరైటీలు ఆర్‌ఎస్ బ్రదర్స్ వారి నిజామాబాద్ షోరూమ్‌లో మీకోసం సిద్ధంగా ఉన్నాయన్నారు. చైర్‌పర్సన్ అండ్ హోల్ టైం -డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- ప్రతీ సరికొత్త షో రూమ్‌తో పాటు ప ర్వదినాలకు, వివాహ వేడుకలకు కొత్త వెరైటీలను కస్టమర్ల హృదయాలకు చేరువగా తీసుకురావడం మాకు గర్వకారణమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ సీర్ణ రాజమౌళి ప్రసంగిస్తూ- దేశవ్యాప్తం గా ఉన్న ఫ్యాషన్లను సేకరించి మా నిజామాబాద్ కస్టమర్లకు అందిస్తున్నా మన్నారు. హోల్-టైం డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు -నిజామాబాద్‌లో లభించిన అపూర్వ ఆదర ణ మా ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందన్నారు.




