7 March, 2026 | 2:24 AM

టీజీఐఐసీ రూ.37 కోట్ల పనులకు టెండర్లు

06-03-2026 02:22 AM

ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ ఇంజినీర్ కార్యాలయం

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో అడు గు వేస్తూ టీజీఐఐసీ రూ.37 కోట్లకు పైగా అంచనా వ్యయంతో మూడు పనులకు టెండర్లు పిలిచింది. ఈ పనులు రా ష్ట్రంలోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో చేపట్టనున్నారు. మొదటి టెండర్ కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పరిధిలోని ష్యాంపేట్ గ్రామంలో ఉన్న ఎవర్ టాప్ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 132 కేవీ స్థాయిలో ఈహెచ్టి విద్యుత్ సరఫరా విస్తరణ పను లు చేపట్టనున్నారు.

26 ఎంవీఏ కమాం డ్ డిమాండ్‌కు అనుగుణంగా ఈ ప్రాజె క్టు రూపొందించగా, ప్రారంభ దశలో 10 ఎంవీఏ లోడ్‌తో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు సుమారు రూ.8.04 కోట్ల అంచనా వ్య యం నిర్ణయించారు. ఈ టెండర్‌కు బిడ్ డౌన్‌లోడ్ మార్చి 5 మధ్యాహ్నం 3 గం టల నుంచి ప్రారంభమై, బిడ్ సమర్పణకు మార్చి 12 ఉదయం 11 గం.వరకు ఉంటుంది.

రెండో టెండర్ ద్వారా సుల్తాన్‌పూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఆర్సీసీ స్టార్మ్ వాటర్ డ్రైన్ల ని ర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈపనులకు రూ.18.08 కోట్ల అంచనా వ్య యం నిర్ణయించారు. మూడో టెండర్ కింద ఖమ్మంలో ఆంధ్రప్రదేవ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ తెలంగాణ డివిజన్‌కు సంబంధించిన బ్రాంచ్ కా ర్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు రూ.11.26 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు. రెండు, మూడు టెండర్‌లకు బిడ్ డౌన్‌లోడ్ మార్చి 7 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమై, బిడ్ సమర్పణకు మార్చి 23 మధ్యాహ్నం 3 గంటలుగా నిర్ణయించారు.