దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం!
- రాజక్కపల్లి గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం
ధర్మపురి,(విజయక్రాంతి): దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అన్నారు రాజక్కపల్లి గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం. మహిళా వారోత్సవాలలో భాగంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజక్కపల్లి అంగన్వాడి సెంటర్లో శనివారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడి సెంటర్లో పిల్లలను చేర్పించి స్వేచ్ఛ యుత వాతావరణంలో వారి బాల్యం ఎదుగుదలకు కృషి చేయాలని తెలిపారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలను అంగన్వాడి సెంటర్లో చేర్పించి వారి యొక్క శారీరక, మానసిక, సామాజిక, సృజనాత్మక అభివృద్ధికి తల్లిదండ్రులు కృషి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ స్వప్న,అంగన్వాడీ టీచర్ దోరిశెట్టి తిరుమల,విద్యార్థుల తల్లిదండ్రులు,ఆయమ్మ పాల్గొన్నారు.






