26 February, 2026 | 12:07 AM

రోడ్డు భద్రతపై అవగాహన

25-02-2026 09:51 PM

జైనూర్,(విజయక్రాంతి): జైనూర్ మండలంలోని జామ్‌గావ్ గ్రామంలో బుధవారం “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ సీఐ ఈ.రమేష్, జైనూర్ ఎస్ఐ జి.రవికుమార్తో పాటు జిల్లా కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనదారులు హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపకూడదు, అతివేగం వద్దని, లేన్ నియమాలు పాటించాలి. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదని సూచనలు ఇచ్చారు.

ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాదాల బాధితులతో మాట్లాడి వారి అనుభవాలను గ్రామస్తులతో పంచుకోవడం ద్వారా రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలకు సందేశం ఇస్తూ, “జాగ్రత్తగా వాహనం నడిపితేనే సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల కోసం ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించండి. మీ ప్రాణం – మీ చేతుల్లోనే ఉంది” అని తెలిపారు.