లేక్‌షోర్ మాల్ సమీపంలో రోడ్డుప్రమాదం
నలుగురికి గాయాలు
కూకట్‌పల్లి, జూన్ 13 ( విజయ క్రాంతి): కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జాతీయ రహదా రిపై లేక్ షోర్ మాల్ సమీపంలో ఘోర రో డ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిసిన వివరాల మేరకు చిట్టిగోనె శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుని తన కారులో తిరిగి నగరానికి వస్తుండగా కూకట్‌పల్లి లోని లేక్ షోర్ మాల్ సమీపంలో వెనుక నుంచి అతివేగం గా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టడంతో శ్రీకాంత్ కార్ పల్టీలు కొట్టి తలకిందు లైంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి, అందు లో ఒక మహిళకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్ర యాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న అంబులె న్స్ సిబ్బంది గాయపడిన బాధితలను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.






