1 March, 2026 | 6:48 PM

రింకూసింగ్ తండ్రి కన్నుమూత

28-02-2026 01:53 AM

అంత్యక్రియలు పూర్తి చేసిన రింకూ

నేడు జట్టుతో చేరనున్న యువక్రికెటర్

కోల్ కత్తా, ఫిబ్రవరి 27: భారత క్రికెట్ జట్టు యువ బ్యాటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ తండ్రి ఖంచంద్ర సింగ్ స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న రింకూ శనివారం జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.

శనివారం సాయంత్రానికల్లా రింకు మళ్లీ జట్టుతో చేరనున్నట్లు బీసీసీఐ వర్గాలు జాతీయా మీడియాతో వెల్లడించాయి. దీంతో తండ్రి చనిపోయిన మరుసటి రోజే దేశం కోసం ఆడేందుకు సిద్ధమైన రింకుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. తండ్రిని చూసేందుకు రెండురోజుల క్రితం సొంతూరు వెళ్లిన ఈ యువ క్రికెటర్ మళ్లీ జట్టుతో చేరాడు. కానీ జింబాబ్వే మ్యాచ్‌లో బరిలో దిగే ఛాన్స్ రాలేదు.