10 August, 2026 | 8:34 PM

మంత్రులను కలిసిన హ్యూమన్ రైట్స్ కన్వీనర్ ఆర్.భాను

10-08-2026 04:57 PM

హ్యూమన్ రైట్స్ హక్కులను కాపాడండి..

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలోని రాంనగర్ కాలనీలో గల సాయి శ్రీ బ్యూటీ పార్లర్ యజమాని,హ్యూమన్ రైట్స్ కన్వీనర్ గా తనదైన శైలిలో బాధ్యతలను నెరవేరుస్తూ మహిళా సంఘాలకు ఎంతోగానో ప్రోత్సహిస్తూ పలువురి మహిళలకు బ్యూటీషియన్ లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పించి వారి స్వహస్తాలతో జీవనోపాధి కల్పించుకునే శక్తి సామర్ధ్యాలను, ఏర్పరచుకునేలా, సమాజంలోమహిళలు ఎవరికి తీసిపోరని వారిని ఉత్తేజపరుస్తూ, వారిపై వారికి నమ్మకాన్ని కలిగిస్తూ నారీ లోకాన్ని ముందుకు తీసుకెళ్తూ, మహిళల  సమస్యల పట్ల నిబద్దతతో మంచి మనసుతో చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ, పలువురి మన్ననలను పొంది, చురుకైన పాత్ర పోషిస్తుంది.

పలు మహిళా సంఘాల కార్యక్రమాలకు ఆర్థికచేయుటతోపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీద బడుగు బలహీన వర్గాల మహిళలకు జీవన భృతి కల్పిస్తూ, ఈ క్రమంలో ఈనెల 7వ తేదీ శుక్రవారం రోజున హైదరాబాదులోని పలువురు మంత్రులను వారి నివాస గృహాలలో కలిసి,హ్యూమన్ రైట్స్ పై తన అభిప్రాయాలను మంత్రులకు తెలియజేస్తూ హెచ్ ఆర్  అభివృద్ధి కార్యక్రమాలకు పలువురు మంత్రులు వారి సహాయ,సహకారాలు  అందించాలని,హ్యూమన్ రైట్స్ కన్వీనర్గా తన బాధ్యతను నెరవేర్చి,సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను అడ్డుకొని, తక్షణమే వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టలని, వారికి సరైన న్యాయం జరిగేంత వరకు పోరాడుతూ,

ఐరన్ లేడీ ఉక్కు మహిళగా మహిళా సమస్యల పట్ల తక్షణ సహాయం అందిస్తూ అందరి ఆదరాభిమానాలను చురగున్న  భాను శ్రీ. మంత్రుల నివాసంలో హ్యూమన్ రైట్స్ ప్రత్యేక సమావేశంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, తదితరులను కలిసి మహిళా సమస్యలను కులంకషంగా వివరించి, వారికి ఎటువంటి సహాయం అయినా అందించాలని మహిళా హ్యూమన్ రైట్స్ తరఫున తన అభిప్రాయాన్ని తెలియజేశారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఎటువంటి అవసరాలయనా మంత్రివర్గం అందించడానికి సిద్ధంగా ఉన్నామని,పలువురు మంత్రులు తెలియజేయడం ఎంతో ఆనందం కలిగించిందని భాను శ్రీ పత్రికముకంగా తెలియజేశారు.