29 April, 2026 | 10:51 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

విధి నిర్వహణలో అలుపెరుగని శ్రామికుడికి విరామం

29-04-2026 09:09 PM

150 రూపాయల వేతనంతో మొదలైన జీవిత ప్రస్థానం

38 సంవత్సరాల పాటు విధి నిర్వహణలో అంకితభావం

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి):  తిరుమలాయపాలెం మండలానికి చెందిన యడ్ల ప్రభాకర్ విద్యుత్ శాఖలో 38 సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలు అందించి లైన్ ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ పొందుతున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన 150 రూపాయల వేతనంతో కార్మికుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. వేదుల్లచెరువు గ్రామంలో విద్యుత్ శాఖలో కార్మికుడిగా మొదలైన ఆయన ప్రయాణం విలేజ్ వర్కర్‌గా కొనసాగి 2003లో ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు పొందారు.

తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, బయ్యారం మండలాల్లో విధులు నిర్వహిస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుని మళ్లీ విధుల్లో చేరి తన సేవలను కొనసాగించారు. తోటి ఉద్యోగులు, గ్రామ ప్రజల మన్ననలు పొందిన ప్రభాకర్ పలుపదోన్నతులు అందుకుని ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు, పలు గ్రామాల ప్రజలు ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.