జేఈఈ మెయిన్ ఫలితాల్లో ‘రెజోనెన్స్’ ప్రభంజనం
వరంగల్‌కు ఆలిండియా రెండవ ర్యాంక్
వరంగల్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో రెజోనెన్స్ వరంగల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి అఖిల భారత ర్యాంకుల్లో(ఏఐఆర్) విశేష విజయాలను సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో రెజోనెన్స్ చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తమ విద్యార్థులు సాధించిన అగ్ర ర్యాంకుల పట్ల ఆనందంవ్యక్తం చేశారు.
విద్యార్థుల ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.. నానాల నాగచైతన్య ఆలిండియా రెండవ ర్యాంక్, పీడబ్ల్యూడీ జనరల్ విభాగంలో ఏఐఆర్ ౨, పీడబ్ల్యుడీ ఓబీసీ విభాగంలో ఏఐఆర్ 1వ ర్యాంక్ సాధించారు. సీహెచ్ సాయి వర్షిత్ ఏఐఆర్ 228, బిల్లా సాయినాథ్‌రెడ్డి ఏఐఆర్410, ఎ.రితిక ఏఐఆర్ 508, పి.కార్తికేయ ఏఐఆర్ 777, ఎం.సాయి కౌశిక్ ఏఐఆర్ 1012, ఎండీ అష్‌హర్ ఇక్బాల్ ఏఐఆర్1278, ఆర్.జయంత్ ఏఐఆర్ 2572, జి.వర్ధిని ఏఐఆర్ 3239, ఎస్.ఆకర్ష్ ఏఐఆర్ 3635, జె.హర్షిత్ ఏఐఆర్ 5058, వై.సాత్విక ఏఐఆర్ 5635 ర్యాంకులు సాధించారు.
ఈ అద్భుత ర్యాంకులతో పాటు రెజోనెన్స్ వరంగల్‌కు చెందిన మరో 13 మంది విద్యార్థులు 99+పర్సెంటైల్ సాధించి దేశంలోని ప్రతిష్ఠాత్మక నీట్‌లలో సీట్లు పొందే అర్హతను సంపాదించారు. ఈ విజయాలు విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, రెజోనెన్స్ వరంగల్ ఫ్యాకట్టీ బందం నిబద్ధతకు నిదర్శనం. సుదీర్ఘ అనుభవం, సిస్టమాటిక్ అకడమిక్ ప్లానింగ్, వ్యక్తిగత శ్రద్ధతో విద్యార్థులను అగ్రస్థాయికి చేర్చడం మా లక్ష్యమని లెక్కల రాజిరెడ్డి తెలిపారు.
ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఫ్యాక్టల్టీ సభ్యులకు రెజోనెన్స్ వరంగల్ యాజమాన్యం హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. భవిష్యత్తులో కూడా ఇంతకుమించి అద్భుత ఫలితాలను సాధించేందుకు కట్టుబడి ఉన్నామని చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో చైర్మన్ లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్స్ లెక్కల మహేందర్‌రెడ్డి, మాదిరెడ్డి దేవెందర్‌రెడ్డి, సీఏవో లెక్కల రమ్యారాజిరెడ్డి, అకాడమిక్ డీన్ బీఎస్ గోపాలరావు, అన్ని బ్రాంచిల ప్రిన్సిపాల్స్, విద్యార్థులతల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.






