16 August, 2026 | 3:59 PM

సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

16-08-2026 03:24 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)తో కలిసి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.