calender_icon.png 9 February, 2026 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత ధర్నా రాస్తారోకో

09-02-2026 04:22:48 PM

వెంకేపల్లి తండా వాసుల బైఠాయింపు 

మర్రిగూడ,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకేపల్లి గ్రామం పంచాయతీ పరిధిలోని వెంకేపల్లి తాండ వాసులు మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన జటావత్ బాలాజీ (35) మృతి పట్ల తమకు న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడు జటావత్ హాథిరామ్  నుండి నష్ట పరిష్కారం అందజేయాలని డిమాండ్ చేశారు.

పోలీసుల వాహనమును అడ్డుకున్నారు  కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అనాధలైన పిల్లలకు వెంటనే తగు న్యాయం చేకూర్చేందుకు పోలీసులు వెనకాడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం చెందారు. పోస్టుమార్టం నిర్వహించిన శవాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి నుండి తమకు అప్పగించి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాలాజీ ఆత్మహత్యకు కారణమైన హాథిరాంను మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేసి తగు న్యాయం చేకూర్చాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో నినదించారు.