1 July, 2026 | 3:42 AM

యూరియా యాప్‌ను రద్దు చేయాలని వినతి

01-07-2026 12:00 AM

గరిడేపల్లి, జూన్ 30 : యూరియా యాప్ ను రద్దుచేసి రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందించాలని రైతు కూలీ సంఘం డివిజన్ కార్యదర్శి మేకల కనకారావు అన్నారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తాసిల్దార్ స్రవంతి కి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి యూరియా యాప్ వల్ల రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

రైతులంతా చదువుకున్న వారు కాదని అందరికీ స్మార్ట్ ఫోన్లు లేవని ఉన్న వాటిని కూడా ఆపరేటింగ్ చేయడం సరిగ్గా తెలియనటువంటి స్థితిలో రైతాంగం ఉన్నారు అన్నారు. యూరియా యాప్ వల్ల రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగ సమస్యలను పరిష్కరించి యూరియా యాప్ ను రద్దుచేసి వారికి ఎరువులు విత్తనాలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలీ సంఘం డివిజన్ నాయకులు దూద్యా, చనగాని పెద్ద సాంబయ్య, కారింగుల సైదులు, చింతమల్ల అంజయ్య, నరసింహారావు, సిహెచ్ పర్వతాలు, లక్ష్మయ్య, గుండు నగేష్, ముత్తయ్య, నరసయ్య, నెమ్మాది బిక్షం, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.