12 June, 2026 | 3:10 AM

జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలి

12-06-2026 12:41 AM

టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్, డీఈఓలకు వినతి

కామారెడ్డి, జూన్ 11 (విజయక్రాంతి): జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి గురువారం వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా టి యు డబ్ల్యూ జె ( ఐజేయు)జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ... జిల్లాలో 500 పైగా అర్హులైన జర్నలిస్టులు ఉన్నారు. వీరిలో పేద, మధ్యతరగతి కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అందుకని వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వ జీవో ప్రకారం 100% రాయితీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయ సూపరిండెంట్ వరప్రసాద్, జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్, ఆబిద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, జర్నలిస్టులు శివ, శ్రీకాంత్, శ్రీనివాస్  రెడ్డి, ముదాం శంకర్, ముదాం వెంకటేశ్వర్లు, మాణిక్య శ్రీకాంత్, మధు, ఇంజమూరి శ్రీనివాస్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.