calender_icon.png 21 February, 2026 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చత్రపతి శివాజీ విగ్రహ స్థాపనకు వినతి

21-02-2026 01:27:50 PM

మల్లాపూర్ ఫిబ్రవరి, 21(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో హైందవ స్వరాజ్య సేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సేన ప్రతినిధులు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ భారత చరిత్రలో ధైర్యసాహసాలు, ధర్మ పరిరక్షణ, ప్రజా సంక్షేమానికి ప్రతీక అని తెలిపారు. యువతకు దేశభక్తి, కర్తవ్యబోధను పెంపొందించే ఉద్దేశంతో గ్రామ కేంద్రంలో విగ్రహ స్థాపన చేయాలని కోరారు.వినతి పత్రాన్ని స్వీకరించిన గ్రామ సర్పంచ్, కార్యదర్శులు ఈ అంశాన్ని గ్రామపంచాయతీ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హైందవ స్వరాజ్య సేన నాయకులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.