3 August, 2026 | 11:42 PM

ఆర్డీఓ ప్రజావాణిలో 6 వినతులు నమోదు

03-08-2026 08:01 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ ప్రజావాణిలో మొత్తం 6 వినతులు నమోదయ్యాయి. భూ సమస్యలు, బోధన్ పట్టణంలో అక్రమంగా నిర్మించిన టిన్ షెడ్ తొలగింపు, కుటుంబ కలహాలు, మున్సిపల్ పరిధిలో రోడ్ల మరమ్మతులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు, ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా రెండు ఆవులు మృతి చెందిన ఘటనకు సంబంధించి పరిహారం కోరుతూ దరఖాస్తులు అందాయి. సంబంధిత శాఖల అధికారులు వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ సూచించారు.