18 July, 2026 | 12:54 AM

లార్డ్స్‌లో వీడ్కోలు?

18-07-2026 12:46 AM

రోహిత్ రిటైర్మెంట్‌పై కథనాలు

వన్డే ప్రపంచకప్ ప్లాన్స్‌లో లేని హిట్‌మ్యాన్

లండన్‌కు రోహిత్ తల్లిదండ్రులు

సెలెక్టర్ల తీరుపై రోహిత్ అసంతృప్తి

తాను కొనసాగుతానని చెప్పిన రోహిత్

భారత క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు చేరుకుందా.. చారిత్రక లార్డ్స్ వేదికగా హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నాడా.. ప్రపంచకప్ ప్రణాళికల్లో లేవంటూ సెలక్టర్లు చెప్పేశారా.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఇదే హాట్ టాపిక్. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డేతో రోహిత్ రిటైర్ కానున్నట్టు జోరుగా సాగుతున్న వేళ అతని తల్లిదండ్రులు లండన్ చేరుకోవడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది.

లండన్, జూలై 17: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుస వైఫల్యాలతో పాటు 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో తాను లేడన్న విషయాన్ని సెలక్టర్లు రోహిత్‌కు స్పష్టం చేసినట్టు సమాచారం. దీనిపై ఇటు రోహిత్ కానీ, అటు బీసీసీఐ కానీ స్పందించలేదు.

2027 వన్డే వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో హిట్‌మ్యాన్ లేడన్న వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఇక వన్డే క్రికెట్‌కు కూడా రోహిత్ గుడ్‌బై చెబుతున్నట్టు సమాచారం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టును నిర్మించాలని భావిస్తున్నారు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యశస్వి జైస్వాల్ లాంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నా రు. ఈ క్రమంలోనే పేలవ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను పక్కన పెట్టేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.

2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేడని, ఈ ఇంగ్లాండ్ పర్యటన తర్వాత భవిష్యత్తు కోసం వేరే ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని సెలక్టర్లు ఇప్పటికే రోహిత్‌కు స్పష్టం చేసినట్లు కొన్ని మీడి యా కథనాలు పేర్కొన్నా యి. తుది నిర్ణయాన్ని మా త్రం రోహిత్ శర్మకే వదిలేసినట్టు ఆ కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత ఫామ్ కూడా పేలవంగా ఉండడం మరో కారణం గా చెబుతున్నారు. గత కొన్ని వన్డే ఇన్నింగ్స్‌లో రోహిత్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు.

ఇంగ్లాండ్ తోజరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీలోని మొదటి రెండు మ్యాచ్ లోనూ పెద్దగా పరుగులు చేయలేదు. వచ్చే ఏడాది చివరి వరకూ హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ కాపాడుకోవడం కూడా సవాల్ గానే భావి స్తున్నారు. మరోవైపు, భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ రోహిత్ రిటైర్మెంట్ పుకార్లను కొట్టిపారేశారు. డ్రెస్సింగ్ రూమ్‌కు రోహి త్‌పై పూర్తి నమ్మకం ఉందని, అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. అయితే రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు బలం చేకూరుస్తూ అతని తల్లిదండ్రులు లండన్ చేరుకున్నారు.

సాధారణంగా రోహిత్ ఆడే మ్యాచ్‌లకు భార్య రితిక, పిల్ల లు తప్పిస్తే తల్లిదండ్రులు కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది హఠాత్తుగా రోహిత్ పేరెంట్స్ ఇప్పుడు లండన్ చేరుకోవడంతో రిటైర్మెంట్ ఖాయమేనం టూ పలువురు అంచనా వేస్తున్నారు. టీమిం డియా జెర్సీలో చివరిసారిగా తమ కుమారుడిని ప్రత్యక్షంగా చూసేందుకు వారు వచ్చారని భావిస్తు న్నారు. కాగా రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ క్రికె ట్‌లో టీ ట్వంటీ, టెస్ట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు.

2024లో భారత జట్టుకు కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ అందించిన తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తర్వాత 2025లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఇప్పటి వరకూ 287 వన్డేలు ఆడిన రోహిత్ 11 వేలకు పైగా పరుగులు చేశాడు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ ఖాతాలో మూడు వన్డే డబుల్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఒకే ప్రపంచకప్‌లో 5 సెంచరీలు  బాదిన ఆటగాడు కూడా అతడే. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహి త్ ఏకంగా 5 సెంచరీలు బాది, ఒకే టోర్నమెంట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగా డిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.