వైభవంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవం
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్థులు
కడ్తాల్, మే 12 (విజయక్రాంతి ): మండల కేంద్రమైన కడ్తాల్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం మంగళవారం కనులపండువగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులకు ఆలయ అభివృద్ధి పనుల కోసం తన వంతు సహాయంగా రూ.15,000/- రూపాయల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎల్‌ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని కోరారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గురిగళ్ళ లక్ష్మయ్యతో పాటు మంగళపల్లి నరసింహ, గురిగళ్ళ చంద్రయ్య, గూడెపు జంగయ్య, సిద్ది గారి జంగయ్య, కాలె రమేష్, మాదారం మహేష్ గౌడ్, శేఖర్ యాదవ్, అంజయ్య, కరుణాకర్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






