29 March, 2026 | 4:12 PM

ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

01-12-2025 12:31 AM

మాదాపూర్‌లో పోలీసులు, టీజీఐఐసీ సంయుక్తంగా చర్యలు

శేరిలింగంపల్లి, నవంబర్ 30 (విజయక్రాంతి): మాదాపూర్ మైండ్‌స్పేస్ ప్రధాన రహదారిపై ఎన్నోరోజులుగా పాదచారులకు తావు లేకుండా వరుసగా పెరిగిన ఫుడ్‌స్టాళ్లు, షెడ్లు, చిన్నతరహా దుకాణాలు ఆదివారం ఉదయం సుడిగాలిలా తొలగిపోయాయి. గౌరా రోడ్ నుంచి రహేజా ఐటీ పార్క్ వరకు ఫుట్‌పాత్‌లను మొత్తం మింగేసి వ్యాపారాలు కొనసాగించడం వల్ల వాహనాల రాకపోకల కు అంతరాయం ఏర్పడుతున్నది.

ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా పెరుగుతూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు, టిజిఐఐసీ సంయుక్త బృందం ఆది వారం ఉదయం రంగంలోకి దిగి ఒక్కొక్క స్టాల్‌ను గుర్తించి ఎలాంటి సడలింపులు లేకుండా తొలగించారు. సోదా మొత్తం ట్రాఫి క్ డీసీపీ సాయి మనోహర్, ఏసీపీ చందర్షేకర్ రెడ్డి పర్యవేక్షణలో సాగడంతో చర్యలకు ఊపు వచ్చింది. తొలగింపుల తరువాత రహదారి వెడల్పు స్పష్టంగా కనిపించడంతో పాదచారులు మళ్లీ ఫుట్పాత్పే నడవగలిగారు.