25 April, 2026 | 2:32 AM

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఊరట

25-04-2026 01:08 AM

ఉద్యమం నాటి కేసులు హైకోర్టులో కొట్టివేత

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాం తి): మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. దాదాపు 15 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా 2011 మార్చి 10న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం విధించిన ఆంక్షలను ధిక్కరించి ‘మిలియన్ మార్చ్’ నిర్వహించడంతో అప్పట్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు కీలక నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.