హిందూ సమ్మేళన ఆహ్వానం కరపత్రాల విడుదల
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఈ నెల 24వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రేమల గార్డెన్లో నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను ఆదివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు భోనగిరి సతీష్ బాబు మాట్లాడుతూ హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామాఖ్య దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ శ్రీ శ్రీ భవానీ స్వామీజీ విచ్చేసి హిందూ ధర్మం గొప్పదనం గురించి వివరించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రధాన వక్తగా సామాజిక కార్యకర్త, హిందూ ఆక్టివిస్ట్ శ్రీ సౌమిత్రి లక్షణాచార్య పాల్గొని ప్రసంగించనున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్ గందం శ్రీనివాస్ మాట్లాడుతూ గడప లోపల కులం ఉన్నా, గడప దాటితే అందరం హిందువులమని, ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి ఉపాధ్యక్షుడు కాండ్రే విశాల్, ప్రధాన కార్యదర్శి ఆకుల సంతోష్, ఆర్‌ఎస్‌ఎస్ సంపర్క్ ప్రముఖ్ నాగుల శ్రీనివాస్, శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు, జంజిరాల శ్రీనివాస్, సోమ శ్రీకాంత్, సురేష్ చారి తదితరులు పాల్గొన్నారు.






