8 April, 2026 | 9:36 PM

ప్రభుత్వ విద్యాలయాలు... ప్రతిభావంతులకు వేదికలు

08-04-2026 07:48 PM

విద్యతోపాటు పాఠ్యయేతర కార్యక్రమాలలో ముందుండడం అభినందనీయం

జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుడు అజామొహినుద్దీన్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాలయాలు ప్రతిభావంతులకు వేదికలని విద్యార్థులు విద్యతోపాటు పాఠ్యతర కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమని జవహర్ నగర్ జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుడు అజా మొయినుద్దీన్ పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మహారథి ఇంటర్నేషనల్ ఓపెన్ రేటెడ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తొమ్మిది పాయింట్లు గాను ఐదు పాయింట్లు సాధించిన జవహర్ నగర్ ఉన్నత పాఠశాల విద్యార్థి అనిల్ కు, దమ్మాయిగూడకు చెందిన శారదాంబ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనిల్ ని ఘనంగా సన్మానించి ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హాజరై మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలకు గుర్తింపు తెచ్చినందుకు విద్యార్థిని అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటలలో కూడా రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారదాంబ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంగాధర్ రావు మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి తగిన విధంగా ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సామాజిక కార్యకర్త ఉదయ్ కుమార్ రూ. 2500 అనిల్ కు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్, మల్లికార్జునరావు, నర్సింగ్ రావు, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.