3 August, 2026 | 2:32 PM

వన మహోత్సవంలో పాల్గొన్న ఎంఎల్ ఏ

03-08-2026 01:23 PM

మంచిర్యాల టౌన్ , (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) పరిధిలోని 52వ డివిజన్ లో గల రాముని చెరువు వద్ద మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.